‘కొబ్బరిమట్ట’లో మూడున్నర నిమిషాల డైలాగ్ చెప్పాను: హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు

  • ఈ డైలాగ్ ను సింగిల్ టేక్, సింగిల్ షాట్ లో చేశాను
  • పది రోజులు ప్రాక్టీస్ చేశాను
  • ఎంత పెద్ద డైలాగ్ అయినా, ఎంత కష్టమైనా నేర్చేసుకుంటా
‘కొబ్బరిమట్ట’ చిత్రంలో మూడున్నర నిమిషాల డైలాగ్ ను సింగిల్ టేక్, సింగిల్ షాట్ లో చేశానని ప్రముఖ హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ డైలాగ్ చెప్పేందుకు పది రోజులు ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. ఈ చిత్ర దర్శకుడు స్టీవెన్ శంకర్, ఎక్కడా కాంప్రమైజ్ కారని, పేపర్ పై ఉన్న డైలాగ్ తన మైండ్ లో ఉండాలని లేకపోతే ఆయన ఒప్పుకోరని తెలిపాడు.

‘నాకు టైమిస్తే ఎంత పెద్ద డైలాగ్ అయినా, ఎంత కష్టమైనా నేర్చేసుకుంటా. నాకు డైలాగ్స్ చెప్పడమంటే ఇష్టం’ అని చెప్పాడు. కొబ్బరిమట్ట’ చిత్రంలో ‘పెదరాయుడు’, ’పాపారాయుడు’, ’ఆండ్రాయిడ్’ మూడు పాత్రలను పోషించానని చెప్పాడు. వచ్చే నెల 10న విడుదల కానున్న ఈ చిత్రంలో తనకు నలుగురు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు, ఆరుగురు హీరోయిన్స్ ఉన్నారని వివరించారు.
Go Back to Shorts
Kobbarimatta
movie
comedian
sampurnesh babu

More Telugu News